![]() |
growing yaganti basavanna |
Yaganti Basavanna
![]() |
Growing yaganti basavanna |
ఈ గుడిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి..
1. శివ పార్వతులిరువురి ప్రతిమలు ఒకే శివలింగంపై ఉండునట్లుగా శివలింగం ఉంటుంది ఈ ఆలయంలో.. ఈ విధంగా వేరే ఏ శివాలయంలోను శివ లింగం ఇలా ఉండదు... (For full info.. click here>>>Yaganti Umamaheswara swamy temple information<<<<<<)
2. ఈ ఆలయం మొదట వేంకటేశ్వర స్వామికై ప్రారంభించారు.. కానీ తీరా ప్రతిష్టించే సమయాన వేంకటేశ్వరస్వామి విగ్రహ కాలి భాగంలో లోపం కనపడిందట.. అందుకే ప్రతిష్ట ఆగిపోయింది.. ఆలయ ప్రధాన ధర్మకర్త కలలో పరమేశ్వరుడు వచ్చి.. ఇక్కడ తన ఆలయాన్ని ప్రతిష్టించమని అది కూడా శివ పార్వతులిద్దరూ ఒకే శివలింగంలో వచ్చే విధంగా ప్రతిష్టించమని ఆదేశించారట.. అందుకే ఇక్కడి ఉమామహేశ్వర స్వామి శివలింగంలో శివ పార్వతులిరువురు మనకు దర్శనమిస్తారు..
3. పూర్వం ఈ ప్రదేశంలో అగస్త్యుడు యాగం చేసారట అందుకే ఈ స్థలానికి యాగంటి అని పేరు వచ్చింది..
4. యాగం చేసేటపుడు.. రాక్షసులు కాకి రూపంలో వచ్చి యాగ స్థలంలో మాంసపు ముద్దలు వేస్తున్నారని... అగస్త్యుడు కాకులు ఈ ప్రదేశంలోకి రావద్దని శపించారట... అందుకే ఈ ప్రదేశం లో ఇప్పటికీ కాకులు కనపడవు..
5. ఇక్కడ కొండలలోనుండి కోనేరులోకి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది.. ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో తెలియదు.. కోనేరు లో నీరు బయటకు ఎక్కడికీ పోవు.. కోనేరు సమీపంలో బోర్ వేసినా చుక్క నీరు పడదు.. అంతా విచిత్రం.. స్వామి మహత్యమో..
6. శనీశ్వరుని వాహనం కాకి అగస్త్యుని శాపం వలన ఇక్కడకు కాకులు రావు.. కాబట్టి తనకు కూడా స్థానం లేదని.. శనీశ్వరస్వామి వారు అలిగి వెళ్ళి పోయారట.. అందుకే శనీశ్వరుడు లేక నవగ్రహాలు ఉండవు.. కనుక.. ఇక్కడ నవగ్రహ మండపం ఉండదు.. ఆ స్థానంలో నందీశ్వర విగ్రహం ఉంటుంది..
7. ఈ ఆలయం విష్ణు ఆలయం కోసం ప్రారంభించారు కాబట్టి.. ఆలయ నిర్మాణం అంతా విష్ణు ఆలయాల మాదిరే ఉంటుంది.. అందుకే కొంచెం భిన్నంగా ఉంటుంది.. ఈ ఆలయం..
Key words:
Yaganti, Yaganti Temple information in telugu, Growing Yaganti Basavanna, Yaganti Umamaheswara Temple pictures images photoes.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.